
Injection: ఆ ఇంజెక్షన్‌తో 15% బరువు తగ్గిపోవచ్చు!
అమెరికాలో భారీ డిమాండ్
న్యూయార్క్: అమెరికాలో ‘వీగోవీ’ అనే ఔషధానికి ప్రస్తుతం భారీ డిమాండ్ ఏర్పడింది. ఊబకాయంతో బాధపడుతున్న వారంతా ఈ మందు కోసం దుకాణాలకు పోటెత్తుతున్నారు. అమెరికా వయోజనుల్లో మూడో వంతు కంటే ఎక్కువమంది ఊబకాయిలే. దీంతో గిరాకీకి తగ్గట్లుగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంజెక్షన్ రూపంలో తీసుకొనే ఈ మందుతో 15 శాతం వరకు బరువు తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్ అనే కంపెనీ ‘వీగోవీ’ ఔషధాన్ని తయారుచేస్తోంది. అమెరికాలో దీని వినియోగానికి ఈఏడాది జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అగ్రరాజ్యంలో అనుమతి లభించడం ఇదే తొలిసారి. గతంలో అనేకం వచ్చినప్పటికీ.. వాటికి నియంత్రణ సంస్థల క్లియరెన్స్ లభించలేదు. పైగా తీవ్ర దుష్పభ్రావాలు ఉండేవి. ఈ నేపథ్యంలోనే వీగోవీకి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. దీన్ని ఇంజెక్షన్ రూపంలో వారానికి ఓ డోసు చొప్పున నాలుగు సార్లు తీసుకోవాలి. ఆకలిని నియంత్రించి తద్వారా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన డిమాంè్తో దాని తయారీ కంపెనీ ఆదాయం గత త్రైమాసికంలో 41 శాతం ఎగబాకింది. ఈ ఔషధానికి ఇంతలా గిరాకీ పెరగడానికి కొవిడ్ కూడా ఓ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఔషధం వినియోగం వల్ల వాంతులు, యాసిడ్ రీఫ్లక్స్ వంటి దుష్పభ్రావాలు కూడా ఉన్నట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Technology News
HTC Smartphone: హెచ్‌టీసీ నుంచి తొలి మెటావర్స్ ఫోన్
-
Sports News
IND vs ENG : కనీసం రెండు సెషన్లు ఆడలేకపోయారా..? భారత ప్రదర్శనపై రవిశాస్త్రి తీవ్ర అసంతృప్తి
-
Politics News
T Congress: విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో లంచ్.. వస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్ సీనియర్లు!
-
Business News
Services PMI: ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్ తగ్గలే
-
Technology News
Location Tracking:యాప్స్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
-
General News
CM Jagan: ‘బైజూస్’తో విద్యార్థులకు మెరుగైన విద్య: సీఎం జగన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!