Published : 20 Sep 2020 20:04 IST

తెరుచుకోనున్న తాజ్‌మహల్

దిల్లీ: పర్యాటకులకు శుభవార్త. దేశానికే తలమానికంగా నిలిచిన తాజ్‌మహల్‌ ఆరునెలల తరువాత తెరుచుకోనుంది. సోమవారం నుంచి ఈ విశిష్ట కట్టడం సందర్శనకు అనుమతిస్తున్నట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం తెలిపారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్‌ సంరక్షకుడు అమర్‌నాథ్‌ గుప్తా పేర్కొన్నారు. ఇందుకోసం పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశీయులకు ప్రవేశ టికెట్‌ ధర రూ.1100గా నిర్ణయించారు. స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్‌లో 2500 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రసిద్ధ ఆగ్రా కోట సందర్శనకు అధికారులు అనుమతించారు.
 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని