కొత్త పార్లమెంట్‌ భవనం కాంట్రాక్టు టాటాదే!

టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతిష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం పనులను ఆ సంస్థ చేపట్టనుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్ట్‌ సాధించింది. కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణానిక......

Published : 16 Sep 2020 19:20 IST

దిల్లీ: టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతిష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకుంది. కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం పనులను ఆ సంస్థ చేపట్టనుంది. రూ.861.90 కోట్లకు ఈ కాంట్రాక్ట్‌ సాధించింది. కొత్త పార్లమెంట్‌ భవనం నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రజా పనుల శాఖ ఈరోజు ఫైనాన్షియల్‌  బిడ్లను తెరవగా.. టాటా, ఎల్‌ అండ్‌ టీ సంస్థలు ప్రధానంగా పోటీ పడ్డాయి. రూ.861.90 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ఏడాదిలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొత్త పార్లమెంట్‌ భవన త్రిభుజాకారంలో నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే, దీనికోసం రూ.865 కోట్లకు బిడ్‌ వేసినట్టు ఎల్‌ అండ్‌ టీ సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం నిర్మించిన పార్లమెంట్‌ భవనం ఆంగ్లేయుల కాలం నాటిది. ఇప్పడున్న భవనం పాతది కావడంతో పాటు ఇబ్బందికరంగా ఉండటంతో కొత్త భవనం నిర్మాణానికి గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. లోక్‌సభ నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరిస్తే కొత్తగా వచ్చే సభ్యులకు ప్రస్తుత భవనం సరిపోయే పరిస్థితి లేదని కేంద్రం చెబుతోంది. ఈ భవనాన్ని మరమ్మతులు చేసిన తర్వాత ఇతర పనులకు వాడుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు