Fevers in UP: యూపీలో డెంగీ కలకలం.. 32 మంది చిన్నారుల మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో తీవ్ర జ్వరంతో 32 మంది పిల్లలు సహా 41 మంది మరణించడం కలకలం

Published : 02 Sep 2021 11:32 IST

32 మంది పిల్లలు సహా 41 మంది మృతి
ఐసీఎంఆర్‌ బృందం రాక

ఫిరోజాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో తీవ్ర జ్వరంతో 32 మంది పిల్లలు సహా 41 మంది మరణించడం కలకలం రేపుతోంది. దీనికి డెంగీనే కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిరోజాబాద్‌ జిల్లా ప్రధాన వైద్యాధికారి నీతా కుల్‌శ్రేష్ఠ్‌ను బదిలీ చేయడం చర్చనీయాంశం అయింది. ఆమెను అలీగఢ్‌ మల్‌ఖాన్‌ సింగ్‌ జిల్లా ఆసుపత్రికి సీనియర్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బదిలీ ఎందుకు చేశారన్న విషయంపై స్పష్టత లేదు. మరోవైపు ఫిరోజాబాద్‌లో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు దిల్లీ ఐసీఎంఆర్‌ నుంచి 11 మంది నిపుణుల బృందం చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని