
Afghanistan: ఆకాశంలో పుట్టిన అఫ్గాన్ పాపాయి
పురుడు పోసిన బ్రిటన్ విమాన సిబ్బంది
ఇస్తాంబుల్: అఫ్గానిస్థాన్ నుంచి శుక్రవారం రాత్రి శరణార్థులతో బయలుదేరిన విమానం.. శనివారం బ్రిటన్‌లో దిగేసరికి ప్రయాణికుల జాబితాలో అదనంగా మరొకరు చేరారు. మార్గంమధ్యలో విమానంలోనే ఓ పాప పుట్టింది. 26 ఏళ్ల సోమన్ నూరి తన మూడో బిడ్డకు 30 వేల అడుగుల ఎత్తులో జన్మనిచ్చింది. భర్తతో కలిసి విమానం ఎక్కిన సోమన్ నూరికి టేకాఫ్ అయిన కాసేపటికే పురిటి నొప్పులొచ్చాయి. ‘‘విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా?’’ అంటూ సిబ్బంది అరిచారు. ఎవరూ లేరని తేలడంతో విమాన సిబ్బందే ఆమెకు కాన్పు చేసి సురక్షితంగా బ్రిటన్ చేర్చారు. ఆ పాపకు ‘హవా’ అనే పేరు పెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.