Antibody: అన్ని కరోనా రకాలకు ఒక్కటే విరుగుడు.. కొత్త యాంటీబాడీ గుర్తింపు 

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లోని అనేక వేరియంట్ల బారి నుంచి రక్షణ కల్పించే ఒక యాంటీబాడీని అమెరికాలోని

Published : 24 Aug 2021 15:29 IST

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌లోని అనేక వేరియంట్ల బారి నుంచి రక్షణ కల్పించే ఒక యాంటీబాడీని అమెరికాలోని వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ కణాల్లోకి ప్రవేశించడానికి కరోనా వైరస్‌.. తన స్పైక్‌ ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో అనేకరకాల వేరియంట్లపై పనిచేసే యాంటీబాడీలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా స్పైక్‌ ప్రొటీన్‌లోని కీలకమైన ‘రిసెప్టార్‌ బైండింగ్‌ డొమైన్‌’ (ఆర్‌బీడీ) అనే భాగాన్ని కొన్ని ఎలుకల్లోకి చొప్పించారు. అనంతరం వాటిలో ఉత్పత్తయిన యాంటీబాడీలను పరిశీలించారు. వాటిలో 43 రకాలు ఆర్‌బీడీని గుర్తించగలుగుతున్నట్లు తేల్చారు. అందులోని రెండు యాంటీబాడీలు.. ఇన్‌ఫెక్షన్‌ నుంచి కాపాడటంలో సమర్థత చాటినట్లు గుర్తించారు. వీటిని కరోనాలోని ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, కప్పా, అయోటా సహా పలు వేరియంట్లపై పరీక్షించారు. సార్స్‌2-38 అనే యాంటీబాడీ.. కరోనాలోని అన్ని రకాలను అడ్డుకున్నట్లు గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని