Crypto currency: రూ.4,537 కోట్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్‌

క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఇది భారీ కుదుపు.. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ (డీఫై) సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌

Published : 12 Aug 2021 10:48 IST

డియర్‌ మోసగాళ్లూ! మా సొమ్ము ఇచ్చేయరూ.. 
హ్యాకర్లను వేడుకొంటూ పాలినెట్‌వర్క్‌ టీం లేఖ

లండన్‌: క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఇది భారీ కుదుపు.. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ (డీఫై) సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌ యాప్‌లో దొంగలు చొరబడ్డారు. ఈ యాప్‌ తాలూకు బ్లాక్‌చెయిన్‌ను ఛేదించి.. కనీ వినీ ఎరుగని రీతిలో 61.1 కోట్ల డాలర్ల (రూ.4,537 కోట్లు) క్రిప్టో కరెన్సీని చోరులు కొల్లగొట్టారు. పాలినెట్‌వర్క్‌ కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ మంగళవారం ట్వీట్‌ చేశారు. హ్యాకర్లు ఆ సొమ్మును మళ్లించిన చిరునామాలను కూడా అందులో పేర్కొన్నారు. ఈ చిరునామాల నుంచి వచ్చే టోకెన్లను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా ఇతర ఎక్స్ఛేంజీలకు విజ్ఞప్తి చేశారు. మరో ప్రయత్నంగా.. ‘డియర్‌ హ్యాకర్స్‌’ అంటూ కొల్లగొట్టిన సొమ్మును తిరిగి వెనక్కు బదిలీ చేయవలసిందిగా వారిని కోరుతూ లేఖ కూడా రాశారు.

అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేఖ చివర హెచ్చరించారు. ఎ§లినెట్‌వర్క్‌ వేదికగా వినియోగదారులు క్రిప్టో కరెన్సీ టోకెన్లు మార్పిడి చేసుకొంటూ ఉంటారు. హ్యాకింగు ఉదంతంతో వేలాది పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. పాలినెట్‌వర్క్‌లోని ఈథేరియం నుంచి 27.3 కోట్ల డాలర్లు, బినాన్స్‌ స్మార్ట్‌ చెయిన్‌ నుంచి 25.3 కోట్ల డాలర్లు, 8.5 కోట్ల యూఎస్‌ డాలర్‌ కాయిన్లు, 3.3 కోట్ల డాలర్ల స్టేబుల్‌ కాయిన్లను హ్యాకర్లు సొంతం చేసుకున్నారు. ఈ హ్యాకింగుపై బినాన్స్‌ క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజి సీఈవో చాంగ్‌పెంగ్‌ జావో స్పందిస్తూ.. ‘పాలినెట్‌వర్క్‌ దోపిడీకి గురైన విషయం తెలిసింది. భద్రత పరంగా మేము అన్ని చర్యలు తీసుకొంటున్నాం. గ్యారంటీ లేదు.. మేము చేయగలిగినంత చేస్తాం’ అని ట్వీట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని