Delhi High Court: ఎన్నికల ప్రణాళికల్లో నగదు బదిలీ హామీ అవినీతే! 

‘ఎన్నికల్లో అవినీతిపై ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారు?’

Published : 16 Sep 2021 11:15 IST

 ఈసీకి నోటీసు పంపిన దిల్లీ హైకోర్టు  
కాంగ్రెస్, తెదేపాలూ అభిప్రాయాలు చెప్పాలి

దిల్లీ: ‘ఎన్నికల్లో అవినీతిపై ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు జంకుతున్నారు?’ అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు.. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో నగదు బదిలీ హామీ ఇవ్వడం కూడా ఎన్నికల అవినీతి కిందికే వస్తుందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించాల్సిందిగా కూడా కోరింది. ‘కేవలం లేఖలు రాసి, నోటీసులు ఇచ్చి సరిపెట్టవద్దు. కార్యాచరణ కావాలి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినవారిపై మీరు తీసుకున్న చర్యలేమిటో చూస్తాం’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ డీఎన్‌ పటేల్, జస్టిస్‌ జ్యోతిసింగ్‌ల ధర్మాసనం బుధవారం ఈసీని సూటిగా అడిగింది. ‘నోటుకు ఓటు’ హామీలను ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 123 కింద అవినీతిగానే పరిగణించాల్సి ఉంటుందన్న పిటిషనుపై స్పందించాల్సిందిగా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరింది. పిటిషనులో పేర్కొన్నట్టు.. 2019 సాధారణ ఎన్నికల్లో కొన్ని వర్గాలకు నగదు బదిలీ ఆశ చూపిన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ), తెలుగుదేశం పార్టీల (తెదేపా) అభిప్రాయాలను సైతం కోర్టు అడిగింది. నాటి ఎన్నికల్లో ‘న్యాయ్‌’ పథకం పేరిట ఏటా రూ.72 వేలు వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తామని ఐఎన్‌సీ హామీ ఇచ్చింది. ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 24కు హైకోర్టు వాయిదా వేసింది. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని