Kerala: కేరళ గవర్నర్‌ నిరాహార దీక్ష

ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్‌. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న

Updated : 15 Jul 2021 10:57 IST

తిరువనంతపురం: ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్‌. అక్కడ మహిళలపై ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న వరకట్న వేధింపులు, బాధితురాళ్ల అనుమానాస్పద మృతి సంఘటనలు రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన్ను కలచివేశాయి. ఈ సామాజిక దురాచారంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వరకట్న రక్కసిని అంతం చేయడానికి సంకల్పించారు. ఇందుకోసం వినూత్న పంథా ఎంచుకున్నారు. తన అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో నిరాహార దీక్ష చేపట్టారు! ఆయనే కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌. ఆయన బుధవారం ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించి సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగించారు.

అనంతరం గాంధీభవన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష విరమించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ విద్యార్థులు  భవిష్యత్తులో వరకట్నాలు తీసుకోవడం, ఇవ్వడం చేయమని ప్రమాణం చేస్తూ కళాశాల నుంచి ధ్రువపత్రాలు తీసుకొనే సమయంలో సంతకం చేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకునేలా కేరళలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్‌ ఛాన్సలర్లకు లేఖలు రాస్తానని చెప్పారు. వరకట్న వేధింపులతో పలువురు మహిళలు మరణించడంపై గతంలో గవర్నర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని