Vehicle Horn: హారన్‌ కొడితే.. భారతీయ సంగీతం! 

వాహనాల హారన్లను వినసొంపుగా మార్చే దిశగా యోచిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Updated : 06 Oct 2021 10:51 IST

వాహనాల విషయంలో సరికొత్త చట్టం తీసుకొచ్చే యోచన: గడ్కరీ 

నాసిక్‌: వాహనాల హారన్లను వినసొంపుగా మార్చే దిశగా యోచిస్తున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పిల్లనగ్రోవి, తబలా, వయోలిన్, మౌత్‌ ఆర్గాన్, హార్మోనియం వంటి భారతీయ సంగీత సాధనాల ద్వారా రూపొందించిన ధ్వనినే వాహనాలు హారన్లుగా ఉపయోగించేలా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అంబులెన్సులు, పోలీసు వాహనాలకు వినియోగిస్తున్న సైరన్‌ ప్రజలకు చికాకు పుట్టించేలా ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దాని స్థానంలో.. ‘ఆకాశవాణి’ ట్యూన్‌ను ప్రవేశపెట్టే దిశగా కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని