
Raj Kundra: నీలిచిత్రాలతో అడ్డంగా సంపాదించిన రాజ్‌కుంద్రా
ముంబయి పోలీసుల ఛార్జిషీట్
ముంబయి: సినిమా అవకాశాల కోసం ముంబయికి వచ్చే యువతులను వంచించి నీలిచిత్రాలు తీయడం ద్వారా ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా (46) పెద్దఎత్తున ఆర్జించినట్లు ముంబయి పోలీసులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన 1,500 పేజీల అనుబంధ ఛార్జిషీటులో పేర్కొన్నారు. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్‌కుంద్రా, అతని సహచరుడైన రేయాన్ థోర్పేలకు వ్యతిరేకంగా ఈ ఛార్జిషీటును క్రైం బ్రాంచ్ పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించారు. నీలిచిత్రాలను కొన్ని యాప్‌ల ద్వారా నిందితులు మార్కెటింగ్ చేసుకునేవారని అందులో తెలిపారు. ఈ కేసులో సింగపూర్‌కు చెందిన యశ్ ఠాకుర్, లండన్‌కు చెందిన ప్రదీప్ బక్షి కూడా నిందితులుగా ఉన్నారు. వీరిని అరెస్టు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. రాజ్‌కుంద్రా, థోర్పే గత జులై నెల 19 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ముంబయి సెషన్స్ కోర్టులో పెండింగులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.