Mumbai: ఆ ప్రాంతాల్లో 80 శాతం అదృశ్యమయ్యే ప్రమాదం!

ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ముంబయిలోని కీలక ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోయే ముప్పు పొంచి ఉంది.

Published : 29 Aug 2021 14:44 IST

వాతావరణ మార్పుల దుష్ప్రభావం

ముంబయి: ముందుజాగ్రత్తలు తీసుకోకపోతే ముంబయిలోని కీలక ప్రాంతాలన్నీ సముద్రంలో మునిగిపోయే ముప్పు పొంచి ఉంది. 2050 నాటికి రాష్ట్ర సచివాలయమైన ‘మంత్రాలయ’, వ్యాపార కేంద్రమైన నారిమన్‌ పాయింట్‌లలో 80 శాతం మేర అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది. వాతావరణ మార్పులు కారణంగా సముద్ర మట్టాలు పెరగనుండడమే ఇందుకు కారణం. సాక్షాత్తూ ముంబయి నగర పాలక సంస్థ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ ఛాహల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి వాతావరణ కార్యాచరణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర మట్టాలు, భారీ వర్షాల కారణంగా పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు. నగరంలోని ఏ, బీ, సీ, డీ వార్డులు నీట మునుగుతాయని చెప్పారు. తుపాన్లు వచ్చినప్పుడు భారీ వర్షాలు సంభవిస్తున్నాయని, ఇది కూడా వాతావరణంలో మార్పులకు హెచ్చరిక అని తెలిపారు. మరో 25-30 సంవత్సరాలంటే పెద్ద సమయం ఏమీ కాదని, ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాల్సి ఉందని చెప్పారు. వర్షాల కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను వర్గీకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని