twitter: దావా పరిష్కారానికి రూ.5,971 కోట్లు

వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపడం ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన దావాను పరిష్కరించుకునేందుకు ఏకంగా ..

Published : 22 Sep 2021 12:42 IST

చెల్లించేందుకు ముందుకొచ్చిన ట్విటర్‌

శాన్‌ఫ్రాన్సిస్కో: వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపడం ద్వారా పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించారంటూ దాఖలైన దావాను పరిష్కరించుకునేందుకు ఏకంగా రూ.5,971 కోట్ల మేర చెల్లించేందుకు ‘ట్విటర్‌’ సంస్థ ముందుకొచ్చింది. ట్విటర్‌ సోమవారం స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సంబంధిత మొత్తాన్ని 2021 నాలుగో త్రైమాసికంలో చెల్లించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనకు జడ్జి అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ట్విటర్‌ ఉన్నతాధికారులు 2014లో ఉద్దేశపూర్వకంగా తమ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించారని ఆరోపిస్తూ.. సంస్థ పెట్టుబడిదారుల్లో ఒకరైన డోరిస్‌ షెన్‌విక్‌ 2016లో కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని