WHO: డెల్టా రకంతో మున్ముందూ ముప్పు

డెల్టా రకంతో ముడిపడి కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న తీరు కారణంగా కరోనా కేసులు అన్ని ప్రాంతాల్లో గణనీయంగా

Updated : 15 Jul 2021 11:34 IST

ఐరాస: డెల్టా రకంతో ముడిపడి కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న తీరు కారణంగా కరోనా కేసులు అన్ని ప్రాంతాల్లో గణనీయంగా పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తంచేసింది. తక్కువ సంఖ్యలోనే వ్యాక్సిన్లు పూర్తయినందున దీనివల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోందని వారపు నివేదికలో హెచ్చరించింది. ఈ నెల 13 నాటికి కనీసం 111 దేశాల్లో డెల్టా ఉనికి ఉందని, రాబోయే నెలల్లో ఇది మరింతగా విస్తరించనుందని తెలిపింది. ఆల్ఫా రకం 178 దేశాలు/ ప్రాంతాల్లో, బీటా 123 దేశాల్లో, గామా 75 దేశాల్లో కనిపించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు గుర్తించిన ‘ఆందోళనకర రకం’ వైరస్‌లలో డెల్టా వ్యాప్తి వేగం అత్యధికమని తెలిపింది. కొత్తకొత్త రకాలు పుట్టుకువస్తుండడం, ప్రభుత్వాలు వివిధ ఆంక్షల్ని సడలించడం, ప్రజారోగ్య చర్యల్ని తగిన రీతిలో చేపట్టకపోవడం, సామాజిక కార్యకలాపాలు పెరగడం వంటివి అనేక దేశాల్లో కేసులు, మరణాలను పెంచేస్తున్నాయని వివరించింది. వైరస్‌ వ్యాప్తి తీరుతెన్నులను గమనించే వ్యవస్థే చాలాచోట్ల లేదంది. ‘ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మందికి కనీసం కరోనా మొదటి డోసు అందింది. ఆ పంపిణీలోనూ తీవ్ర అసమానతలు ఉన్నాయి. సంపన్న దేశాలే ఎక్కువ టీకాలను పొందాయి’ అని పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని