Viral: ఆమె పడక గదిలో 18 పాములు

సాధారణంగా ఇంటిని శుభ్రపరిచేటపుడు బొద్దింకలు, చీమలు కనిపిస్తాయి. కానీ ఆమెకు పాము పిల్లలు

Published : 16 Jul 2021 23:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఇంటిని శుభ్రపరిచే సమయంలో బొద్దింకలు, చీమలు కనిపిస్తాయి. కానీ ఆమెకు పాము పిల్లలు కనిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 పాములు. జార్జియాకు చెందిన ట్రిష్‌ విల్‌చెర్‌ జులై 12న బెడ్రూమ్‌ శుభ్రం చేస్తుండగా ఓ పాము పిల్ల కనిపించింది. వెంటనే భయంతో పరుగెత్తి తన భర్తకు విషయం చెప్పింది. భర్త సాయంతో గది మొత్తం శోధించగా బెడ్‌ కింద ఒక పెద్ద పాము, పదిహేడు పిల్ల పాములు దర్శనమిచ్చాయి. వాటిని జాగ్రత్తగా పట్టుకుని దగ్గరలో ఉన్న అడవిలో విడిచిపెట్టారు. గదిలో అన్ని పాములు కనిపించే సరికి భయాందోళనకు గురయ్యానని, ఆ సంఘటన తర్వాత ఇంట్లో కూర్చోవడానికి కూడా భయమేసిందని విల్‌చెర్‌ చెప్పుకొచ్చారు. పాములను చూశాక ఆమెకు కలిగిన అనుభూతిని, పాములకు సంబంధించిన చిత్రాలను ఫేస్‌బుక్‌ ద్వారా పంచుకున్నారు. ఆ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని