
చేతులు వదిలేసి కారు డ్రైవింగ్.. చివరికి..
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. దైవాన్ని నమ్మే వారు.. వాటిని భగవంతుడు పెట్టే పరీక్షలని భావిస్తారు. కానీ, ఓ మహిళ ఏకంగా దేవుడికే పరీక్ష పెట్టింది. కారును వేగంగా నడుపుతూ చేతులు వదిలేసి.. దేవుడా.. నన్ను క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంది. చివరికి తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైంది.
యూఎస్‌లోని ఓహైయోకు చెందిన 31 ఏళ్ల మహిళ ఇటీవల తన కుమార్తెతో కలిసి.. కారులో బయటకు వెళ్లింది. అయితే, మధ్యలో ఏమైందో ఏమో తెలియదు గానీ.. ఆకస్మాత్తుగా యాక్సిలరేటర్‌పై కాలు నొక్కి పట్టి కారు వేగాన్ని గంటకు 190 కి.మీకి పెంచింది. స్టీరింగ్ వదిలేసి భగవంతుడే తనని కాపాడాలని, క్షేమంగా ఇంటికి తీసుకెళ్లమని ప్రార్థించడం మొదలుపెట్టింది. స్టీరింగ్ వదిలేయడంతో కారు వేగంగా వెళ్తూ ఓ జంక్షన్ వద్ద వాహనాన్ని, రోడ్డుపక్కన స్తంభాలను ఢీకొట్టి అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ మహిళకు, ఆమె కుమార్తెకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, పోలీసులు వారిని ఆస్పత్రిలో చేర్చారు.
పోలీసులు మొదట నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. కానీ, విచారణలో ఆ మహిళ దేవుడుపై భారం వేసి కారు నడిపించానని చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతోపాటు ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.
ఇవీ చదవండి
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.