Assets: వందేళ్లకు తిరిగొచ్చిన రూ.556 కోట్ల ఆస్తి
ఇక మనది కాదనుకుని, తరాల కిందటే మర్చిపోయిన కోట్ల రూపాయల ఆస్తి, అనుకోకుండా చేతికొస్తే? అదే జరిగింది... దక్షిణ కాలిఫోర్నియాలో! విల్లా, ఛార్లెస్ బ్రూస్‌లు 1912లో....
ఇక మనది కాదనుకుని, తరాల కిందటే మర్చిపోయిన కోట్ల రూపాయల ఆస్తి, అనుకోకుండా చేతికొస్తే? అదే జరిగింది... దక్షిణ కాలిఫోర్నియాలో! విల్లా, ఛార్లెస్ బ్రూస్‌లు 1912లో ఇక్కడి బీచ్ సమీపాన నల్లజాతీయుల కోసం వెస్ట్‌కోస్ట్ రిసార్ట్ నిర్మించారు. ఇందులో లాడ్జి, కేఫ్, డాన్స్ హాల్ వంటివి ఉండేవి. తెల్ల జాతీయులకు ఇది కంటగింపుగా మారింది. ఓసారి దీనికి నిప్పు పెట్టేందుకు కూడా విఫలయత్నం చేశారు. ఎలాగైనా ఈ రిసార్ట్‌ను ఆక్రమించుకోవడం కోసం అక్కడ ఓ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మన్హటన్ బీచ్ అధికారులు ప్రకటించారు. ఇలా 1924లో ఈ రిసార్ట్ తెల్లవారి చేతుల్లోకి వెళ్లింది. అయితే... తిరిగి దీన్ని బ్రూస్ కుటుంబానికి అప్పగించనున్నట్టు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు. బ్రూస్ మునిమనవడు ఆంటోనీ బ్రూస్ సమక్షంలో గురువారం సంబంధిత బిల్లుపై సంతకం కూడా చేశారు. అప్పట్లో 1,225 డాలర్లకు కొన్న ఈ భూమి విలువ ప్రస్తుతం 75 మిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.556 కోట్లు!
- కాలిఫోర్నియా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్