Corona Virus: శరీరంపై కరోనా వైరస్‌ను అంతంచేసే యంత్రం

శరీరం, దుస్తులపై ఉన్న కరోనా వైరస్‌ను నాలుగు సెకన్లలో అంతంచేసే ‘ఫుల్‌ బాడీ డిసిన్ఫెక్ట్‌ యంత్రం’ను ఐఐటీ-పట్నా పరిశోధకులు రూపొందించారు. ప్రయోగాత్మ కంగా దీన్ని పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటుచేశారు. దీని ద్వారం గుండా ఇవతలి నుంచి

Updated : 31 Oct 2021 08:03 IST

పట్నా: శరీరం, దుస్తులపై ఉన్న కరోనా వైరస్‌ను నాలుగు సెకన్లలో అంతంచేసే ‘ఫుల్‌ బాడీ డిసిన్ఫెక్ట్‌ యంత్రం’ను ఐఐటీ-పట్నా పరిశోధకులు రూపొందించారు. ప్రయోగాత్మ కంగా దీన్ని పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద ఏర్పాటుచేశారు. దీని ద్వారం గుండా ఇవతలి నుంచి అవతలికి వెళ్తే సరిపోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన, సురక్షితమైన ద్రావణాన్ని ఈ పరికరం పిచికారి చేస్తుంది. మూడు మోడళ్లలో ఈ యంత్రాన్ని రూపొందించామని, ఇందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని పరిశోధనకర్త వరుణ్‌ కుమార్‌ సాహి తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఈ పరికరం తయారీపై దృష్టి సారించామని, ఎలాంటి ద్రావణాన్ని వినియోగించడం వల్ల హాని ఉండదన్న విషయమై అనేక పరీక్షలు చేపట్టి దీనికి తుదిరూపు ఇచ్చామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని