India - Bangladesh: 50 ఏళ్ల తర్వాత ఆ మార్గంలో తొలి రైలు

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత గూడ్స్‌ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Updated : 13 Aug 2022 15:24 IST

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత గూడ్స్‌ రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. హల్దిబాడీ-ఛిలహతి మార్గాన్ని పునరుద్ధరించిన తర్వాత మొదటిసారిగా ఓ గూడ్స్‌ రైలు బయలుదేరింది. 2020 డిసెంబర్‌ 17న ప్రధాని మోదీ, బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా.. ఈ మార్గాన్ని పునః ప్రారంభించారు. కరోనా కారణంగా ఇప్పటివరకూ ఆ మార్గంలో అధికారికంగా రైలు సేవలు కొనసాగలేదు. ఈ గూడ్స్‌ రైలు పశ్చిమబెంగాల్‌లోని అలిపుర్‌దివార్‌ జిల్లాలోని దిమ్‌దిమ స్టేషన్‌ నుంచి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రయాణం ప్రారంభించింది. బల్దిబరి మీదుగా బ్లంగాదేశ్‌లోని ఛిలహతికి చేరుకోనుంది. హల్దిబాడీ-ఛిలహతి రైల్‌ లింక్‌ మధ్య 1965 వరకు రవాణా జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని