PAK Terrorist: లష్కరే శిక్షణ పొందా
కశ్మీర్లో చొరబాటుకు యత్నించి, భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్ పాత్రా (19) సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని అంగీకరించాడు
కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చెప్పేవన్నీ అబద్ధాలే
భారత్‌లో చొరబాటుకు యత్నించిన పాక్ ఉగ్రవాది వెల్లడి
శ్రీనగర్: కశ్మీర్లో చొరబాటుకు యత్నించి, భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్ పాత్రా (19) సంచలన విషయాలు బయటపెట్టాడు. తాను పాకిస్థాన్‌కు చెందినవాడినని అంగీకరించాడు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా తనకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించాడు. ఈనెల 26న ఉరి సెక్టార్ వద్ద ఎదురుకాల్పులు జరుగుతున్న సమయంలో భారత సైనికులు అతడిని పట్టుకున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఉగ్రవాద శిక్షణ పొందడానికి దారితీసిన పరిస్థితులపై మీడియాతో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైన్యం బుధవారం విడుదల చేసింది.
మాది పేద కుటుంబం..
‘‘నాది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒకారా. మాది పేద కుటుంబం. నాన్న లేడు. వస్త్ర పరిశ్రమలో పనిచేసేవాడిని. ఆ సమయంలో ఐఎస్ఐతో సంబంధాలున్న కుర్రాడితో పరిచయం ఏర్పడింది. డబ్బుకి ఆశపడి అతనితో పాటు లష్కరే తొయిబాలో చేరాను. శిక్షణ సమయంలో వారు రూ.20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయ్యాక మరో రూ.30 వేలు ఇస్తామన్నారు. తర్వాత నన్ను పాకిస్థాన్ సైన్యం వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పినట్టు నేను, మరికొందరు భారత్‌లో చొరబడేందుకు ప్రయత్నించాం. మాలో ఒకరిని భారత సైనికులు హతమార్చారు. నలుగురు పారిపోయారు. సైనికులు నన్ను పట్టుకున్నారు. పాక్ సైనికులతో పోల్చితే భారత సైనికుల వ్యవహారశైలి భిన్నంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు చూశాక... కశ్మీర్ విషయంలో పాక్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తొయిబా చెప్పేవన్నీ అబద్ధాలేనని అర్థమైంది. వారికి నా మొర ఒక్కటే. నన్ను భారత్‌కు ఎలా పంపారో...తిరిగి మా అమ్మ దగ్గరకు అలాగే తీసుకెళ్లండి. భారత సైన్యం రక్తపాతం సృష్టిస్తుందని మాకు చెప్పారు. కానీ ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది. సైనికులు నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఈ విషయం మా అమ్మకు చెప్పాలని ఉంది’’ అని అలీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Elon Musk: ‘అవును కెటామైన్ తీసుకున్నా’.. డ్రగ్స్ వినియోగంపై మస్క్
-
PSL: మ్యాచ్ జరుగుతుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో సిగరెట్ తాగిన క్రికెటర్
-
Supreme Court: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో.. రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు
-
SS Rajamouli: త్వరలో షూటింగ్.. మహేశ్ మూవీపై జక్కన్న అప్డేట్
-
MLC Kavitha: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న కవిత
-
IPL 2024: రోహిత్ శర్మ, సంజు శాంసన్ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్ జురెల్