Published : 20/08/2020 18:18 IST

రామమందిర నిర్మాణం ప్రారంభం!

భారత పురాతన, సంప్రదాయాలకు లోబడే అద్భుత నిర్మాణం
వెల్లడించిన శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్‌

దిల్లీ: ఎన్నో ఏళ్లుగా భారతీయులు ఎదురుచూస్తోన్న రామమందిర నిర్మాణ పనులు ఈ రోజు(ఆగస్టు 20వతేదీ) అయోధ్యలో ప్రారంభమైనట్లు రామ జన్మభూమి ట్రస్ట్‌ వెల్లడించింది. సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(రూర్కీ), ఐఐటీ మద్రాస్‌తో పాటు ఎల్‌&టీ ఇంజనీర్లు అయోధ్యలోని మందిర నిర్మాణ ప్రాంతంలో భూ పరీక్షలు నిర్వహించినట్లు రామజన్మభూమి ట్రస్ట్‌ పేర్కొంది. రానున్న 36 నుంచి 40నెలల్లో మందిర నిర్మాణ పనులు పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భారత పురాతన, సంప్రదాయ నిర్మాణ శైలిని అనుసరించి ఈ మందిరం నిర్మితమవుతుందని పేర్కొంది. భూకంపాలు, తుపానులు, ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుందని ట్రస్ట్‌ వెల్లడించింది.

అయితే, ఈ మందిరం కట్టడంలో ఇనుమును మాత్రం ఉపయోగించమని రామజన్మభూమి ట్రస్ట్‌ స్పష్టం చేసింది. ఆలయ నిర్మాణంలో రాగి పలకలను ఉపయోగించనున్నామని పేర్కొంది. 18 అంగుళాల పొడవు, 30మి.మీ వెడల్పు, 3మి.మీ మందం ఉండే రాగి పలకలను మాత్రమే ఉపయోగిస్తామని తెలిపింది. ఇలాంటి పలకలు దాదాపు 10వేల వరకు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నామని.. భక్తులు ఎవరైనా ఇలాంటి రాగి పలకలను విరాళంగా ఇవ్వొచ్చని ట్రస్ట్‌ ట్విటర్‌లో ప్రకటించింది.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, రామమందిర ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్‌ దాస్‌తోపాటు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని