భూమ్మీదనే అత్యధిక ఉష్ణోగ్రత@54.4°C

అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130డిగ్రీల ఫారెన్‌హీట్‌(54.4డిగ్రీ సెల్సియస్) నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Published : 18 Aug 2020 16:22 IST

అమెరికా డెత్‌ వ్యాలీలో డేంజర్‌ టెంపరేచర్‌
107 ఏళ్ల తర్వాత ఇదే అత్యధిక ఉష్ణోగ్రత!

కాలిఫోర్నియా: అమెరికాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలిఫోర్నియాలోని డెత్‌ వ్యాలీ జాతీయ పార్కులో ఆగస్టు 16న అత్యధికంగా 130డిగ్రీల ఫారెన్‌హీట్‌(54.4డిగ్రీ సెల్సియస్) నమోదైనట్లు అమెరికా జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం 107ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాకుండా భూమ్మీదనే అత్యధిక ఉష్ణోగ్రతగా దీన్ని భావిస్తున్నారు. తాజాగా డెత్‌ వ్యాలీలో నమోదైన ఉష్ణోగ్రత రికార్డును పరిశీలిస్తున్నామని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో)వెల్లడించింది. ఒకవేళ ఇది నిర్ధారణ ఐతే 1913 సంవత్సరం తర్వాత అధిక ఉష్ణోగ్రత ఇదేనని పేర్కొంది. సముద్రమట్టానికి 193 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పరికరంపై ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు లాస్‌వెగాస్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

1913 జులై 10వ తేదీన 134F అత్యధిక ఉష్ణోగ్రత అమెరికాలోనే నమోదైంది. అనంతరం అదే సమయంలో రెండుసార్లు 130F‌ ఉష్ణోగ్రతలు దాటింది. 2013లో మాత్రం 129.2F నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదుకావడంతో అధికారులు మరింత సమాచారం సేకరించిన అనంతరం దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకు భూమ్మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు అమెరికా కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీ జాతీయ పార్కులోనే రికార్డయ్యాయి. ఆ వివరాలు..

134°F    జూన్‌10, 1913
131°F    జూన్‌13, 1913
130°F    జూన్‌12, 1913


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని