కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే క్రమంలో ఓ పోలీసు అధికారికి సైతం అమరుడయ్యాడు............

Published : 30 Aug 2020 08:33 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే క్రమంలో ఓ పోలీసు అధికారి సైతం అమరుడయ్యాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున ముష్కరులు పంథా చౌక్‌ చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌పై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానిక భద్రతా బలగాలు పోలీసులతో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ముష్కరులు మరోసారి కాల్పులు ప్రారంభించడంతో ఇరు వర్గాల మధ్య ఎదుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు ముష్కరుల అక్కడికక్కడే హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు పది మంది ముష్కరుల్ని అంతమొందించాయి. మరో ఉగ్రవాది లొంగిపోవడంతో అతణ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని