కమల గెలుస్తుందని ముందే చెప్పా

అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ గెలుస్తుందని ఆమెతో ముందే చెప్పానని పేర్కొంటున్నారు సెనేటర్‌ మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌...

Updated : 08 Nov 2020 11:27 IST

ఆనందం వ్యక్తం చేసిన మేనమామ

దిల్లీ: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ గెలుస్తుందని ముందే చెప్పానని పేర్కొంటున్నారు ఆమె మేనమామ గోపాలన్‌ బాలచంద్రన్‌. ఫలితాలకు ఒకరోజు ముందే నువ్వు గెలువబోతున్నావని చెప్పానని గర్వంగా పేర్కొన్నారు. దిల్లీలో స్థిరపడ్డ బాలచంద్రన్ హారిస్‌ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘బైడెన్‌-హారిస్‌ల విజయాన్నే మనమందరం కోరుకున్నాం. కమలతో నిన్ననే మాట్లాడా. నువ్వు‌ విజయం సాధించబోతున్నావ్‌ అని అప్పుడే చెప్పా’ అని బాలచంద్రన్‌ పీటీఐకి తెలిపారు.

అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ల అభ్యర్థి బో బైడెన్‌ విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు. ఆ పదవి చేపట్టనున్న మొట్టమొదటి మహిళగానూ, మొట్టమొదటి ఆసియన్‌-అమెరికన్‌గా నిలిచారు. హారిస్‌ విజయంతో అమెరికాతో పాటు భారత్‌లోనూ సంబరాలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఆమె పూర్వీకుల గ్రామంలో వేడుకలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని