భారత్‌ బంద్‌కు ట్రేడ్‌ యూనియన్ల మద్దతు

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు డిసెంబర్‌ 8న తలపెట్టిన ‘భారత్‌ బంద్‌’కు ట్రేడ్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు పది ట్రేడ్‌ యూనియన్ల ఐక్యవేదిక రైతుల ఆందోళనకు సంఘీభావం.....

Published : 05 Dec 2020 16:52 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతు సంఘాలు డిసెంబర్‌ 8న తలపెట్టిన ‘భారత్‌ బంద్‌’కు ట్రేడ్‌ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు పది ట్రేడ్‌ యూనియన్ల ఐక్యవేదిక.. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, వ్యవసాయ చట్టాలు, ఇతర అంశాలపై గత నెల 26న కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రైతులు తలపెట్టిన బంద్‌కు తమ మద్దతు ప్రకటించాయి.

భారత్‌ బంద్‌కు మద్దతు తెలిపిన ట్రేడ్‌ యూనియన్లలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్‌, యూటీయూసీ సంఘాలు ఉన్నాయి. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు తాము మద్దతు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ బంద్‌కు కార్మికులు, ఉద్యోగులు, అనుబంధ సంఘాల సభ్యులు సంఘీభావం తెలియజేయాలని కోరాయి. మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. చర్చలు విఫలమైతే భారత్‌ బంద్‌ను ఉద్ధృతం చేయాలని నిర్ణయించాయి.

ఇవీ చదవండి..

వ్యవసాయ చట్టాల్లో సవరణలకు కేంద్రం ఓకేనా?

కరోనా:కెనడా నేతృత్వం..భారత్‌ గైర్హాజరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని