సుప్రీంకోర్టుకు వెళ్తా!: డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎన్నికల్లో తానే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు.

Updated : 04 Nov 2020 15:49 IST

వాషింగ్టన్‌: అమెరికా ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తి కాకముందే ఈ ఎన్నికల్లో తామే గెలిచినట్లు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ఫలితాలు కీలకంగా మారుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్‌ను అనుమతిస్తున్నారని దీన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌లను అనుమతించడం వెంటనే ఆపివేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టంచేశారు. ‘నిజంగా ఈ ఎన్నికల్లో మనమే గెలుపొందాం. ప్రస్తుతం కొనసాగుతోన్న కౌంటింగ్‌ అమెరికన్‌ ప్రజలను మోసం చేయడమే’ అని ట్రంప్‌ తన మద్దతుదారులతో అన్నారు. 

ఎన్నికల సమయం పూర్తైన తర్వాత వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఇలా వచ్చిన పోస్టల్‌ ఓట్లను అనుమతించవద్దని డొనాల్డ్‌ ట్రంప్‌ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నారు. నవంబర్‌ 3వతేదీ అర్థరాత్రి నాటికి వీటి ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ఈసారి భారీ స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్లను అనుమతించారు. దీంతో ఇప్పటికే వీటిలో చాలావరకు తిరిగి చేరుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా అనుమతిస్తున్నారు. దీంతో వీటి లెక్కింపుకు చాలా సమయం పట్టే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలస్యంగా వచ్చిన పోస్టల్‌ ఓట్లను అనుమతించవద్దని ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళుతానని ప్రకటించారు.

ఇవీ చదవండి..
అమెరికా రాజధానిలో బైడెన్‌ క్లీన్‌స్వీప్‌!
ట్రంప్‌ స్వింగ్‌ బాల్‌..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని