ఇవాంకకు అందం, తెలివి ఉందని..

2016లో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి తన కుమార్తె ఇవాంక ట్రంప్‌ను ఎంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భావించారట.

Published : 30 Sep 2020 01:41 IST

2016 ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవి రేసులో ట్రంప్ కుమార్తె!

వాషింగ్టన్‌: 2016లో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి తన కుమార్తె ఇవాంక ట్రంప్‌ను ఎంచుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భావించారట. అప్పట్లో ట్రంప్‌ ఎన్నికల ప్రచార వ్యవహారాలు చూసుకున్న రిక్‌ గేట్స్‌ నుంచి రాబోతున్న పుస్తకం ‘విక్డ్‌ గేమ్’ను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్టు ఈ వార్తను వెలువరించింది. ఈ పుస్తకం అక్టోబర్‌ 13న పబ్లిష్ కానుంది. 

2016 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ తన సన్నిహితులతో మాట్లాడుతూ..‘ఉపాధ్యక్ష స్థానానికి ఇవాంక అయితే ఎలా ఉంటుంది? ఆమె చలాకీగా, తెలివిగా, అందంగా ఉంటుంది. ప్రజలు ఆమెను ప్రేమిస్తారు!’ అన్నట్టు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. అలాగే ఆయన ఆలోచనల్లో అప్పటి ఇండియానా గవర్నర్‌ మైక్‌ పెన్స్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. అయితే తన ఎంపిక మంచి నిర్ణయం కాదని ఇవాంక తండ్రికి చెప్పినట్లు, దాంతో ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ వార్తను ట్రంప్ అధికార ప్రతినిధి తోసిపుచ్చారు. దాంట్లో వాస్తవం లేదంటూ ఖండించారు. కాగా, ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత వైట్ హౌస్‌లో ఇవాంక  తన తండ్రికి సీనియర్‌ సలహాదారురాలిగా నియమితులయ్యారు. ఆయన రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించేందుకు ఆమె తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని