Updated : 08 Nov 2020 17:26 IST

ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న ట్రంప్‌!

తానే గెలిచానంటూ మరోసారి ట్వీట్‌

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. తానే అధ్యక్షుడినని ఫలితాలు వెలువడక ముందే ప్రకటించుకున్న ఆయనకు.. అసలు ఫలితం మింగుడపడడం లేనట్లుంది! ఇంకా ఎన్నికల్లో తానే విజయం సాధించానని ట్విటర్‌లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ‘‘మా పార్టీ పరిశీలకుల్ని కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఎన్నికల్లో నేనే గెలుపొందాను. 7,10,00,000 లీగల్‌ ఓట్లు సాధించాను. పదవిలో ఉండి రెండోసారి పోటీ చేసిన ఏ అధ్యక్షుడికీ ఈ స్థాయిలో ఓట్లు రాలేదు. కానీ, మాకు అక్కడ అవకతవకలు జరిగాయి. దాన్ని మా పరిశీలకుల్ని చూడకుండా చేశారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. అడగకున్నా అనేక మందికి మెయిల్‌-ఇన్‌ బ్యాలెట్లు పంపారు’’ అని ట్విటర్‌లో ఆరోపించారు. 

ట్రంప్‌ ట్వీట్లపై తొలి నుంచి కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న ట్విటర్‌ తాజా సందేశంపైనా ఫ్యాక్ట్‌ చెక్‌ హెచ్చరిక ఉంచింది. ఎన్నికల్లో అవినీతి జరిగిందనడం వివాదాస్పదమైన అంశమని గుర్తుచేసింది. అమెరికా ఎన్నికల ప్రక్రియలో అవినీతి చోటుచేసుకోవడం చాలా అరుదు అన్న నిపుణుల అభిప్రాయాల్ని హెచ్చరికకు జతచేసింది. అధికారంలో ఉండి రెండోసారి పోటీ చేసిన ఏ అధ్యక్షుడికీ ఈ స్థాయి ఓట్లు దక్కనప్పటికీ.. అప్పటితో పోలిస్తే 2020కి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. ఇప్పటి వరకు ఏ అభ్యర్థీ ఈ స్థాయి తేడాతో ఓడిపోకపోవడం గమనార్హం. 

ఇవీ చదవండి..

ట్రంప్‌ కింకర్తవ్యం?
అమెరికా కోసం అహర్నిశలు కృషి చేస్తా:బైడెన్‌

మాజీ అధ్యక్షులకు పింఛను ఎంతో తెలుసా?


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని