ఓటమికి ముందు ట్రంప్ ఏం చేశారంటే..!
‘‘ఈ ఎన్నికలను నేను గెలిచాను. భారీ విజయం’’ అని ఫలితం వెలువడటానికి దాదాపు గంట ముందే ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో కొన్ని గంటల పాటు ఎటువంటి ట్వీట్ లేదు. సాధారణంగా ట్విటర్‌లో చురుగ్గా ఉండే ట్రంప్.. కీలక సమయంలో ఎందుకు
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘ఈ ఎన్నికల్లో నేను గెలిచాను. భారీ విజయం’’ అని ఫలితం వెలువడటానికి దాదాపు గంట ముందే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో కొన్ని గంటల పాటు ఎటువంటి ట్వీట్ లేదు. సాధారణంగా ట్విటర్‌లో చురుగ్గా ఉండే ట్రంప్.. కీలక సమయంలో ఎందుకు స్పందించడంలేదని ఆయన ఫాలోవర్లు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తనకు నచ్చిన వ్యాపకంలో మునిగిపోయారు. ఆయనకు గోల్ఫ్ ఆడటం ఇష్టం. శనివారం ఆయన ట్వీట్ చేసిన అనంతరం మెల్లగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిపోయారు. ‘‘ఆయన తెల్లటి మెగా క్యాప్, గోల్ఫ్ ఆడే దుస్తులు, బూట్లు ధరించి వెళ్లారు’’ అని శ్వేతసౌధం రిపోర్టర్ తెలిపినట్లు ది గార్డియన్ పత్రిక పేర్కొంది. ట్రంప్ కాన్వాయ్ వర్జినీయాలోని స్టెర్లింగ్‌లోని నేషనల్ గోల్ఫ్ క్లబ్ వైపు దూసుకు వెళ్లింది. అనంతరం ఆయన గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలు మీడియాలో దర్శనమిచ్చాయి.
గోల్ఫ్ అంటే చాలా ఇష్టం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఆయన చాలా సమయం గోల్ఫ్ క్లబ్‌ల్లో కనిపించడం కూడా వివాదానికి దారితీసింది. దీనిని ట్రంప్ తనదైన శైలిలో సమర్థించుకున్నారు కూడా. ఈ ఏడాది జులైలో ఆయన ట్వీట్ చేస్తూ..‘‘ఆడటం నాకు వ్యాయామం. పనిదినాల్లో ఇది చాలా కష్టం. నాకంటే ఒబామా ఎక్కువ సార్లు గోల్ఫ్ ఆడారు’’ అని పేర్కొన్నారు. అమెరికాలో అధ్యక్షుడు చెప్పే అబద్ధాల నుంచి ప్రతిదానికి లెక్కలు తీస్తారు. అలానే ట్రంప్ ఎన్నిసార్లు గోల్ఫ్ ఆడటానికి వెళ్లారు.. ఒబామా ఎన్నిసార్లు వెళ్లారని సీఎన్‌ఎన్ లెక్కలు తీసింది. ఈ ఏడాది మే నాటికి ట్రంప్ తన పదవీకాలంలో 266 రోజులు గోల్ఫ్ క్లబ్‌లో గడపగా.. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అదే పదవీకాలానికి 98 రౌండ్స్ మాత్రమే ఆడారని పేర్కొంది. ఇక ‘ట్రంప్ గోల్ఫ్ కౌంట్’ అనే వెబ్‌సైట్ లెక్కల ప్రకారం.. ఒబామా తన 8ఏళ్ల పదవీకాలంలో మొత్తం 306 రౌండ్లు గోల్ఫ్ ఆడగా.. ట్రంప్ తన నాలుగేళ్ల పదవీకాలం పూర్తికాకుండానే 261 పూర్తి చేసినట్లు పేర్కొంది.
2014లో ఒబామాను వెక్కిరించి..
దేశ అధ్యక్షుడిగా ఒబామా గోల్ఫ్ ఆడటంపై ట్రంప్ 2014లో కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అప్పట్లో అధ్యక్షపదవికి పోటీపడేందుకు ట్రంప్ సన్నాహాలు చేసుకొంటున్నారు. ‘‘మనం ఒబామా ప్రయాణానికి డబ్బు చెల్లిస్తే.. ఆయన మిలియన్ల కొద్దీ నిధులను సమకూర్చుకొంటారు.. ఆ సొమ్ముతో డెమొక్రాట్లు అసత్యాలు ప్రచారం చేస్తారు’’ అని 2014 అక్టోబర్‌లో ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా ట్రంప్ గోల్ఫ్‌లో ఒబామా రికార్డును దాటేయడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు