లెక్కింపు ఆపండి.. కోర్టులకు వెళ్లిన ట్రంప్!
ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు హెచ్చరించినట్లుగానే కోర్టులను ఆశ్రయించారు.
వాషింగ్టన్: ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన డొనాల్డ్ ట్రంప్ ఇదివరకు హెచ్చరించినట్లుగానే కోర్టులను ఆశ్రయించారు. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యం పొందడంతో ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీంతో ఈ ప్రాంతాల్లో కౌంటింగ్‌ను వెంటనే ఆపాలని అక్కడి కోర్టుల్లో దావా వేశారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ముగింపు తేదీపై సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న కేసులో తమను ప్రతివాదిగా చేర్చాలని కోరేందుకు ట్రంప్ బృందం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే, ఎట్టిపరిస్థితుల్లోనూ కౌంటింగ్‌ను ఆపే ప్రసక్తే లేదని డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ స్పష్టంచేశారు. అన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
పెన్సిల్వేనియా, మిషిగన్‌లలో కౌంటింగ్‌పై అనుమానం వ్యక్తం చేస్తోన్న ప్రచార బృందం అక్కడి కోర్టుల్లో దావా వేసింది. కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదంటూ మరో దావా వేస్తామని ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ర్యూడీ గైలైనీ మీడియాతో పేర్కొన్నారు. విస్కాన్సిన్‌లోనూ రీ కౌంటింగ్ నిర్వహించాలని ట్రంప్ బృందం డిమాండ్ చేస్తోంది. అటు నెవాడాలోనూ కౌంటింగ్ జరిగే ప్రక్రియపై తీవ్ర నిరసన వ్యక్తంచేస్తోంది.
ట్రంప్ మద్దతుదారుల ఆందోళన..
ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడు ట్రంప్ వెనుకంజలో ఉన్నట్లు తేలడంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో కౌంటింగ్ ప్రదేశాలకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. దీంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, ముందుజాగ్రత్తగా కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.
ట్రంప్ బృందం ఆరోపణలు..
‘*మిషిగన్, పెన్సిల్వేనియాల్లో కౌంటింగ్‌ను దాచిపెడుతున్నారని.. కౌంటింగ్ కేంద్రాల వద్ద రిపబ్లికన్ పర్యవేక్షకులను అనుమతించడం లేదని ట్రంప్ బృందం ఆరోపిస్తోంది. 25అడుగుల దూరంలో ఉండి కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించవచ్చని నిబంధనల్లో ఉన్నప్పటికీ..దీనికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు రిపబ్లికన్లు గట్టిగా వాదిస్తున్నారు.
*బ్యాలెట్‌ను అనుమతించే కాలాన్ని పొడిగించడాన్ని ట్రంప్ బృందం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో మరో మూడు రోజులు పొడిగిస్తూ..నవంబర్ 12వరకూ బ్యాలెట్‌లను అనుమతించడాన్ని ట్రంప్ బృందం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
*ఎన్నికల తేదీ నాటికే పోస్టల్ బ్యాలెట్‌ను అనుమతించాలని, మొత్తం ప్రక్రియను ఎన్నికల రోజే పూర్తిచేయాలని ట్రంప్ బృందం మొదటినుంచి వాదిస్తోంది.
ఇదీ చదవండి..
మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో బైడెన్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా