మనసు మార్చుకున్న ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన మొండితనాన్ని వీడారు. కరోనాతో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది...........

Updated : 28 Dec 2020 11:31 IST

భారీ సంక్షోభం నుంచి బయటపడేసే నిర్ణయం..

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన మొండితనాన్ని వీడారు. కరోనాతో అతలాకుతలమైన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఉద్దీపన బిల్లుపై సంతకం చేశారు. దీంతో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం తప్పింది. భారీ సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కింది. నిన్నటి వరకు సంతకం చేసేది లేదంటూ మొండికేయడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ అధికార పగ్గాలు చేపట్టే వరకు తీవ్ర ఆర్థిక కష్టాలు తప్పవని భావించారు. కానీ, ట్రంప్‌ మనసు మార్చుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్రంప్‌ ఈ బిల్లుపై సంతకం చేయడంతో నిరుద్యోగ ప్రాయోజిత పథకాల కింద దాదాపు 95 లక్షల మంది అమెరికన్లు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం కింద నిరుద్యోగులకు అందుతున్న తోడ్పాటు మరో 11 వారాలు కొనసాగనుంది. ఈ పథకాల గడువు వచ్చే శనివారంతో ముగియనుండగా.. తాజాగా ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం అందరికీ ఊరట కల్పించింది. కరోనా సృష్టించిన విలయంతో భారీగా నష్టపోయిన అమెరికన్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ప్రతిపాదనతో 900 బిలియన్‌ డాలర్ల(సుమారు 66.37 లక్షల కోట్లు) ప్యాకేజీతో కూడిన బిల్లును ఉభయ సభలు గతంలోనే ఆమోదించాయి. కానీ, అనూహ్యంగా ట్రంప్‌ దాన్ని తిరస్కరిస్తూ వచ్చారు. చిన్న వ్యాపారులకు, పౌరులకు 600 డాలర్ల(రూ.44వేలు) ఆర్థిక సహాయం సరిపోదని, దాన్ని రెండు వేల డాలర్ల(రూ.1.47లక్షలు)కు పెంచాలంటూ అమలుకు సాధ్యంకాని సూచనలిస్తూ వచ్చారు.

ఇవీ చదవండి...

చరిత్ర గతిని మార్చిన సంవత్సరం

కరుణ రసం: ట్రంప్‌లో కొత్తకోణం..!

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని