ట్రంప్‌నకు కరోనా.. ప్రచారం సంగతేంటి?
ట్రంప్‌కు కరోనా సోకటంతో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ డోలాయమానంలో పడింది.
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలకు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉండగా డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడ్డారు. తొలుత అధికార నివాసం వైట్‌హౌస్‌లోనే ఉంటారన్న ట్రంప్.. వైద్యనిపుణుల సూచనల మేరకు ప్రస్తుతం వాషింగ్టన్‌లోని వాల్డర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో పాల్గొన్న ట్రంప్.. ఎన్నికలలోగా మరో రెండు చర్చాగోష్ఠి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ప్రచార నిర్వహణ సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితిలో ప్రచార కార్యక్రమాలను వాయిదా వేయటం లేదా వర్చువల్‌గా నిర్వహించటం అనే రెండు అవకాశాలు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రచార నిర్వాహకుడు బిల్ స్టెపియన్ వెల్లడించారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనాల్సిన అన్ని ప్రచార కార్యక్రమాలను వర్చువల్ రూపంలోకి మార్చే ఏర్పాటు కొనసాగుతోంది. ఆ విధంగా చేయటం సాధ్యం కాకపోతే వాయిదా వేస్తాం. అంతేకాకుండా అధ్యక్షుడి కుటుంబ సభ్యులు భాగం కావాల్సిన కార్యక్రమాలు కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి’’ అని స్టెపియన్ వివరించారు. కాగా, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రచార కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా కీలకమైన ఈ దశలో ట్రంప్ అందుబాటులో లేకపోతే ఆయన విజయావకాశాలపై నీలినీడలు కమ్ముకున్నట్లే అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. మరో వైపు ఎన్నికలు జరిగే నవంబర్ 3లోగా ట్రంప్ కరోనా నుంచి కోలుకుంటే ఆయన ఈ కొవిడ్ విపత్కర పరిస్థితిలో ఆశావాదానికి చిహ్నంగా నిలవచ్చని.. నయం కానట్లయితే సానుభూతితో గెలిచే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Raghunandan Rao: ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై రూ.వెయ్యి కోట్ల పరువునష్టం దావా
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
World News
Cannes: కేన్స్ వేదికగా ఇరాన్లో మరణశిక్షణలు ఆపాలంటూ మోడల్ నిరసన
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!