‘అప్పటి నుంచి చైనా దురాక్రమణలు లేవు’

గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌, చైనా సైన్యాల మధ్య ఉన్న విశ్వాసం ఆవిరై పోయిందని తూర్పు కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. మళ్లీ దాన్ని పునర్‌నిర్మించడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు..........

Published : 16 Dec 2020 13:11 IST

విజయ్‌ దివస్‌ సందర్భంగా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌

దిల్లీ: గల్వాన్‌ ఘర్షణ తర్వాత భారత్‌, చైనా సైన్యాల మధ్య ఉన్న విశ్వాసం పూర్తిగా ఆవిరై పోయిందని తూర్పు కమాండ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ తెలిపారు. మళ్లీ దాన్ని పునర్‌నిర్మించడానికి సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. గల్వాన్ ఘటన తర్వాత తూర్పు కమాండ్‌లో మళ్లీ ఇప్పటి వరకు ఎలాంటి బాహాబాహీ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. అలాగే చైనా వైపు నుంచి ఎలాంటి దురాక్రమణలు కూడా లేవని తెలిపారు. ఘర్షణ తర్వాత ఇరు దేశాలు సరిహద్దుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇరు వర్గాలు క్రమంగా దళాల్ని ఉపసంహరించుకుంటున్నాయన్నారు. అయినప్పటికీ.. ఎలాంటి సవాళ్లను తిప్పికొట్టడానికైనా భారత సైన్యం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. విజయ్‌ దివస్‌ సందర్భంగా ఫోర్ట్‌ విలియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం కల్పించే క్రమంలో పాక్‌తో చేసిన పోరాటంలో భారత్ విజయం సాధించి నేటికి 50ఏళ్లు. ఈ సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద విజయ్‌ దివస్‌ 2020 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందులో పాల్గొని 1971 నాటి యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘స్వర్ణ విజయ జ్యోతి’ని మోదీ వెలిగించారు. ఈ అఖండ జ్యోతులను 1971 యుద్ధం పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలకు తీసుకెళ్లనున్నారు.

ఇవీ చదవండి..

‘స్వర్ణ విజయ జ్యోతి’ వెలిగించి మోదీ నివాళి

పాక్‌ నుంచి ఎన్ని నిధులు అందాయి?ఎవరిచ్చారు?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని