జనవరి 20న బైడెన్‌కు @POTUS ఖాతా

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్‌ ట్రంప్ ఒప్పుకోకపోయినా.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్ష ట్విటర్ ఖాతా @POTUSను జో బైడెన్‌ను అప్పగిస్తామని ట్విటర్‌ స్పష్టం చేసింది. బైడెన్‌ ప్రమాణస్వీకారం

Published : 21 Nov 2020 23:51 IST

లాస్‌ఎంజిల్స్‌: అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్‌ ట్రంప్ ఒప్పుకోకపోయినా.. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్ష ట్విటర్ ఖాతా @POTUSను జో బైడెన్‌ను అప్పగిస్తామని ట్విటర్‌ స్పష్టం చేసింది. బైడెన్‌ ప్రమాణస్వీకారం చేసే రోజే పోటస్‌ ఖాతా నిర్వహణ బాధ్యతలు కూడా ఆయనకు అందిస్తామని తెలిపింది. @whitehouse, @VP ఖాతాలను బైడెన్‌ బృందానికి అప్పజెప్తామని వెల్లడించింది. 

POTUS ఖాతాకు 32మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అమెరికా అధ్యక్షుల అధికారిక కార్యక్రమాల కోసం ఈ ట్విటర్‌ ఖాతాను వినియోగిస్తుంటారు. అధ్యక్షుల వ్యక్తిగత ఖాతాలతో దీనికి సంబంధం ఉండదు. అధ్యక్షుడు మారిన ప్రతిసారి అప్పటివరకు చేసిన ట్వీట్లను ఆర్చివ్‌ చేసి.. కొత్త అధ్యక్షుడికి పోటస్‌ ఖాతాను అందించడం ఆనవాయితీ. అయితే ఈసారి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ ఎన్నికల్లో తన ఓటమిని ఇంకా అంగీకరించలేదు సరికదా.. ఎన్నికల ఫలితాలపై పలు రాష్ట్రాల్లో దావా కూడా వేశారు. అయితే ఎన్నికల్లో బైడెన్‌ విజయం ఖరారవడంతో ట్రంప్‌ ఒప్పుకోకపోయినా పోటస్‌ ఖాతాను శ్వేతసౌధంలో బైడెన్‌ వర్గానికి అందిస్తామని ట్విటర్‌ పేర్కొంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయం సాధించినట్లు నవంబరు 7న అక్కడి ప్రధాన మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి. 538 సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో బైడెన్‌కు 306 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా.. ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చాయి. దీంతో బైడెన్‌ అగ్రరాజ్యానికి 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికా సంప్రదాయం ప్రకారం.. 2021 జనవరి 20న బైడెన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని