23% దిల్లీ వాసుల్లో కొవిడ్‌-19 యాంటీబాడీలు

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చేపట్టిన సిరో ప్రివాలెన్స్‌ అధ్యయనం ఫలితాలు విస్తుగొలుపుతున్నాయి! పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దిల్లీ నగరంలో ఏకంగా 23 శాతం మంది కొవిడ్‌-19 ప్రభావానికి గురయ్యారని తెలిసింది....

Published : 22 Jul 2020 02:00 IST

దిల్లీ: జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం చేపట్టిన సిరో ప్రివాలెన్స్‌ అధ్యయనం ఫలితాలు విస్తుగొలుపుతున్నాయి! పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నప్పటికీ దిల్లీ నగరంలో ఏకంగా 23 శాతం మంది కొవిడ్‌-19 ప్రభావానికి గురయ్యారని తెలిసింది. దాదాపు 23.48 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు తేలింది. ఊహించిన దానికన్నా తక్కువ మందికే సోకిందని సర్వే నిర్వాహకులు భావిస్తున్నారు!

‘మహమ్మారి మొదలై ఆరు నెలలు గడిచినా దిల్లీలో కేవలం 23.48% మంది మాత్రమే ప్రభావానికి గురయ్యారని సిరో ప్రివాలెన్స్‌ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ జన సాంద్రత అత్యంత ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ప్రజలు సరైన కొవిడ్‌-19 ప్రవర్తనతో మెలగడమే ఈ ఫలితాలకు కారణం’ అని అధ్యయనం తెలిపింది.

దిల్లీలో కొవిడ్‌-19 సోకుతున్న వారిలో ఎక్కువ మంది లక్షణాలు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది. అయితే ఇప్పటికీ ముప్పు ముంగిట అనేక మంది ఉన్నారని వెల్లడించింది. ‘ఇంకా ముప్పు పొంచి కాబట్టి ఇదే తీవ్రతతో కట్టడికి చర్యలు తీసుకోవాలి. భౌతిక దూరం, మాస్క్‌/కవర్లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, తుమ్ము లేదా దగ్గినప్పుడు మోచేతులు అడ్డుపెట్టుకోవడం చేయాలి. జనసమ్మర్దం ఎక్కువగా వుండే ప్రాంతాలకు వెళ్లొద్దు’ అని వివరించింది. జూన్‌ 27 నుంచి జులై 10 వరకు ఈ సర్వే చేయగా 21,000 నమూనాలను సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని