పోప్‌ సన్నిహితులకు కరోనా పాజిటివ్‌!

క్రైస్తవుల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా మెలిగే ఇద్దరు మతగురువుల(కార్డినల్స్‌)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా ఇటీవల వీరివురు పోప్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు........

Published : 23 Dec 2020 15:00 IST

వాటికన్‌ సిటీ: క్రైస్తవుల మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌తో సన్నిహితంగా మెలిగే ఇద్దరు మతాధికారుల(కార్డినల్స్‌)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా ఇటీవల వీరివురు పోప్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో వాటికన్‌ సిటీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. పోప్‌ ‘రాబిన్‌ హుడ్‌’గా పిలిచే పాలిష్‌ కార్డినల్‌ కన్రాడ్‌కు మంగళవారం కరోనా నిర్ధారణ అయినట్లు వాటికన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈయన తరచూ పోప్‌ను కలుస్తుంటారు. వాటికన్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఇటలియన్‌ కార్డినల్‌ బెర్టెల్లో సైతం మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్రిస్‌మస్‌ వేడుకల సందర్భంగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన పాల్గొన్నారు. దీంతో అధికారులు వీరివురు ఇటీవల కలిసిన వారందరినీ గుర్తించే పనిలో పడ్డారు.

ఇవీ చదవండి..

దేశంలో కొత్త అలజడి

పాజిటివ్‌, రికవరీ కేసులు..20వేల పైనే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని