వ్యాక్సిన్‌ ఇలా ఇస్తే ఉత్తమం.. ఆక్స్‌ఫర్డ్‌

కరోనా టీకా రెండు పూర్తి డోసులను ఇచ్చినప్పుడు మెరుగైన ఫలితాలు లభించాయన్న ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం

Published : 18 Dec 2020 10:43 IST

లండన్: తమ కొవిడ్‌ టీకా రెండు పూర్తి డోసులను ఇచ్చినప్పుడు అత్యంత మెరుగైన ఫలితాలు లభించాయని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఆస్ట్రాజెనికాతో కలిసి అభివృద్ధి చేసిన టీకాకు సంబంధించిన మధ్యంతర ప్రయోగాల చివరిదశ ఫలితాలను గురువారం  ప్రచురించింది. దీనిలో ఒక పూర్తి డోసు ఇచ్చిన అనంతరం.. బూస్టర్‌ డోసుగా సగం డోసును ఇచ్చినప్పటి కంటే పూర్తి డోసును ఇచ్చినప్పుడు అధిక సామర్థ్యం చూపిందని సంస్థ తెలిసింది. ఈ ఫేజ్‌ 1, 2 క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంగా చేసిన ప్రయోగాల్లో.. పై  రెండు విధానాలూ ఉత్తమ ఫలితాలనే ఇచ్చినప్పటికీ, పూర్తి బూస్టర్‌ డోసు ఇచ్చినప్పుడు మెరుగైన రోగనిరోధకత లభించిందని వివరించింది.

కాగా కొవిడ్‌-19పై పోరులో ఆక్స్‌ఫర్డ్‌, రష్యాతో చేతులు కలిపింది. ఆక్స్‌ఫర్డ్‌‌, స్పుత్నిక్‌ టీకాలను కలపి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. వ్యాక్సిన్‌ సహకారంలో కొత్త అధ్యాయం మొదలైందని.. తాము చేసిన ప్రతిపాదనను ఆస్ట్రాజెనికా అంగీకరించిందని స్పుత్నిక్‌ పేర్కొంది.

ఇవీ చదవండి

హృదయాలు గెలిచి.. కొవిడ్‌ ముందు ఓడారు

కరోనా.. మిస్టరీ మూలాలపై దర్యాప్తు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని