UP: నిమిషాల్లో కీలక బిల్లులకు ఆమోదం

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సోమవారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తుండగా.. ఎలాంటి చర్చా లేకుండానే.....

Published : 23 Aug 2020 02:51 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ సోమవారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ వైపు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తుండగా.. ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లులు ఆమోదం పొందాయి. పబ్లిక్‌, ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసానికి సంబంధించి పరిహారాన్ని వ్యక్తుల నుంచే రాబట్టే కీలక బిల్లు సహా అంటురోగాల నివారణ బిల్లు, గోవధ నిషేధ సవరణ వంటి బిల్లులకు నిమిషాల వ్యవధిలోనే ఆమోద ముద్ర పడింది. సీఏఏ వ్యతిరేకంగా యూపీలో ఆందోళనలు జరిగినప్పుడు ఆందోళనకారుల నుంచి పరిహారాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అప్పట్లో యోగి సర్కారు ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. తాజాగా దీనిపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టింది. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, శాంతిభద్రతలు, వరదలు తదితర అంశాలపై ఓ వైపు విపక్ష పార్టీ సభ్యులు బ్యానర్లతో నినాదాల మధ్యే ఈ బిల్లులకు ఆమోదం లభించింది. విపక్ష నేతల ఆరోపణలపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. కరోనా విషయంలోనూ, శాంతిభద్రతల విషయంలోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం మెరుగ్గా ఉందన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు స్వల్పకాలిక సమవేశాలు సోమవారం వరకు జరగాల్సి ఉండగా.. శనివారమే నిరవధిక వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని