
అందుకే అర్ధరాత్రి అంత్యక్రియలు..
సుప్రీంకు వివరించిన యూపీ ప్రభుత్వం
దిల్లీ: హాథ్రస్ ఘటనలో బాధితురాలికి అర్ధరాత్రి దహన సంస్కారాలు నిర్వహించడానికి గల కారణాలను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వివరించింది. మరుసటి రోజు భారీ స్థాయిలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదిక కారణంగానే తాము ఆ విధంగా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ఘటనలో దాడికి గురైన 19 ఏళ్ల దళిత యువతి.. సెప్టెంబర్ 29 ఉదయం దిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో మరణించింది. కాగా ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన పోలీసులు.. అదే రోజు రాత్రి 2:30 గంటలకు కుటుంబ సభ్యులెవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయమై యూపీ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించింది.
‘‘సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న ధర్నా మాదిరిగానే మరిన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు హాథ్రస్ జిల్లా యంత్రాంగానికి సెప్టెంబర్ 29 ఉదయం నిఘా వర్గాల నివేదికలు అందాయి. అంతేకాకుండా ఈ మొత్తం అంశానికి కులం, మతం రంగు పులిమి దానిని స్వప్రయోజనాలకు ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని కూడా నివేదికలో వెల్లడించారు’’ అని దానిలో పేర్కొంది. దీనిని నివారించేందుకే తాము అత్యవసరంగా బాధితురాలి అంతిమ సంస్కారాలు నిర్వహించామని యూపీ ప్రభుత్వం సుప్రీంకు తెలియజేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
India News
Presidential Election: ‘రబ్బరు స్టాంపు’గా ఉండబోనని ప్రతిజ్ఞ చేయాలి: యశ్వంత్ సిన్హా
-
India News
Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
-
India News
Digital India: ఆన్లైన్ వ్యవస్థతో ‘క్యూ లైన్’ అనే మాటే లేకుండా చేశాం: మోదీ
-
Sports News
IND vs ENG: జో రూట్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇంగ్లాండ్ స్కోర్
-
India News
Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు