మోదీ ప్రతిజ్ఞ నెరవేరిన రోజు

సుమారు 29 సంవత్సరాల తరవాత ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించారు.

Updated : 05 Aug 2020 13:58 IST


దిల్లీ: సుమారు 29 సంవత్సరాల తరవాత ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటించారు. రామ మందిరం నిర్మించినప్పుడే తిరిగి ఈ ప్రాంతానికి వస్తానని 1992లో ప్రతిజ్ఞ చేశారట. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రత్తి కల్పించిన అధికరణ 370 రద్దు కోసం భాజపా సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ నాయకత్వంలో జరిగిన తిరంగా యాత్రకు కన్వీనర్‌గా ఉన్న మోదీ చివరిసారిగా అయోధ్యలో పర్యటించారు. విశేషమేమింటంటే ఆ అధికరణ రద్దై నేటికి సరిగ్గా ఏడాది. 

కాగా, గతేడాది సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫజియాబాద్-అంబేద్కర్‌ నగర్‌ ప్రాంతాల్లో మోదీ పర్యటించినప్పటికీ, అయోధ్యకు మాత్రం వెళ్లలేదు. అయితే రాముడు జన్మించిన స్థలంగా విశ్వసిస్తోన్న రామ జన్మభూమి ప్రదేశాన్ని దర్శించుకున్న మొదటి ప్రధాని మోదీనేనని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అలాగే హనుమాన్‌ గఢీ ఆలయానికి చేరుకున్న మొదటి ప్రధాని కూడా ఆయనేనని తెలిపింది. ఇదిలా ఉండగా..భాజపా అధికారంలోకి రావడానికి చేసిన ఎన్నికల వాగ్దానాల్లో రామ మందిర నిర్మాణ అంశం కీలకమైందన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని