సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయలేం

అన్ని ఏర్పాట్లు పూర్తయినందున అక్టోబర్ 4న జరగనున్న సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమినరీ-2020 పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్(యూపీఎస్సీ) సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

Updated : 28 Sep 2020 17:18 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీఎస్సీ

దిల్లీ: అన్ని ఏర్పాట్లు పూర్తయినందున అక్టోబర్ 4న జరగనున్న సివిల్ సర్వీసెస్‌ ప్రిలిమినరీ-2020 పరీక్షను వాయిదా వేయడం సాధ్యం కాదని యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్(యూపీఎస్సీ) సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే వాయిదా వేయకపోవడానికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం యూపీఎస్సీని ఆదేశించింది. అలాగే దీనికి సంబంధించిన తదుపరి విచారణ బుధవారం జరగనుంది.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో కొందరు సివిల్స్ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష వాయిదాను కోరుతూ సుప్రీంలో పిటిషన్ వేశారు. కాగా, అక్టోబర్ 4న దేశ వ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్షకు సుమారు 6లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  వాస్తవంగా మే 31న జరగాల్సిన ఈ పరీక్ష కొవిడ్ కారణంగా వాయిదా పడింది. యూపీఎస్సీ జూన్‌ 5న షెడ్యూల్‌ను సవరిస్తూ, పరీక్ష నిర్వహణకు కొత్త తేదీని ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని