మహమ్మారిని భారత్‌ సమర్థంగా ఎదుర్కోగలదు! WHO

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కోటిన్నర మందికి సోకిన ఈ వైరస్‌ 6లక్షల 30వేల మంది ప్రాణాలు తీసుకుంది.

Updated : 24 Jul 2020 12:29 IST

అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ల‌కు కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఉంది
ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే కోటిన్నర మందికి సోకిన ఈ వైరస్‌ 6లక్షల 30వేల మంది ప్రాణాలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ కేసులు నమోదతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, భారత్‌ తొలిమూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ దేశాల్లో నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసుల చొప్పున బయటపడుతున్నాయి. అయితే, కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ మూడు దేశాలకు వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

శక్తిమంతమైన, సామర్థ్యం కలిగిన, ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, బ్రెజిల్, భారత్‌లకు ఈ మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత అంతర్గత సామర్థ్యాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర విభాగాధిపతి మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దేశాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయని అభిప్రాయపడ్డారు.

అమెరికాలో గంటకు 2600 కేసులు..
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతి గంటకు దాదాపు 2600 పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. ఇప్పటికే 
40లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 22లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 84వేల మంది మృత్యువాతపడ్డారు. ఇక భారత్‌లో నిన్న ఒక్కరోజే 49,000 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 12లక్షల 87వేలకు చేరగా మరణాల సంఖ్య 30వేలు దాటింది.

ఇవీ చదవండి..
భారత్‌: ఒక్కరోజే దాదాపు 50వేల కేసులు..!
సమాజంలోకి కరోనా..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని