మోడెర్నా టీకా: యూఎస్‌ వైద్యుడికి తీవ్ర అలర్జీ

మోడెర్నా కొవిడ్‌-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్‌ఫిష్‌(షెల్ ఫిష్‌ తిన్నవెంటనే వచ్చే అలర్జీ) అలర్జీ ఉండటం గమనార్హం.

Published : 26 Dec 2020 11:37 IST

వెల్లడించిన అమెరికన్ మీడియా సంస్థ

వాషింగ్టన్‌: మోడెర్నా కొవిడ్‌-19 టీకాను స్వీకరించిన ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన ఆ వైద్యుడికి అంతకు ముందే షెల్‌ఫిష్‌ అలర్జీ ఉండటం గమనార్హం.

ఇటీవల బోస్టన్ మెడికల్ సెంటర్‌కు చెందిన జెరియాట్రిక్‌ ఆంకాలజీ వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్‌ మోడెర్నా టీకా వేయించుకున్నారు. ఆ వెంటనే తనకు తీవ్ర ప్రతిస్పందనలు కలిగాయని ఆ వైద్యుడు వెల్లడించారు. మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని తెలిపారు. మోడెర్నా టీకా దేశవ్యాప్త పంపిణీ ప్రారంభమైన తరవాత వెలుగులోకి  వచ్చిన సీరియస్ కేసు ఇది. దీనిపై బోస్టన్ మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఆ వైద్యుడికి వచ్చిన అలర్జీకి సంబంధించి వెంటనే చికిత్స చేయించుకున్నారు. ఎమర్జెన్సీ విభాగానికి తరలించి ఆయన అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషించాం. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారు’ అని పేర్కొంది. 

ఇదిలా ఉండగా..కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు అమెరికాలో కొద్దిరోజులుగా మోడెర్నా, ఫైజర్‌ టీకాల పంపిణీ కార్యక్రమం జరుగుతోన్న సంగతి తెలిసిందే. మోడెర్నా కంటే ముందుగా అమెరికన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకాకు సంబంధించి కూడా అలర్జీ కేసులు వెలుగుచూశాయి. వాటికి గల కారణాలపై ఆ దేశ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ విచారణ జరుపుతోంది. 

ఇవీ చదవండి:

యూకే రిటర్న్స్‌: నాలుగేళ్ల చిన్నారికి కరోనా

300 దిగువకు కొవిడ్ మరణాలు

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని