అమెరికా ప్రభుత్వ శాఖలపై సైబర్‌ దాడి

అగ్రరాజ్యంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలపై సైబర్‌ దాడి జరిగింది.

Published : 15 Dec 2020 00:06 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలపై సైబర్‌ దాడి జరిగింది. ట్రెజరీ, వాణిజ్యం తదితర పలు శాఖల వెబ్‌సైట్లపై హ్యాకర్లు దాడిచేసినట్టు సమాచారం. ఈ సంఘటన వెనుక రష్యా హస్తముందని అధికారులు అనుమానిస్తున్నారు. అమెరికాకు సంబంధించిన కీలక సమాచారాన్ని కొల్లగొట్టేందుకు రష్యా ప్రభుత్వం దాడికి ప్రయత్నించే అవకాశాలున్నాయని.. అమెరికా నిఘా విభాగం హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడి చోటుచేసుకోవటం గమనార్హం. ఈ సైబర్‌ దాడి ప్రభావం అధికంగానే ఉండగలదని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా జాతీయ నిఘా సంస్థ ఎఫ్‌బీఐ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీకి చెందిన సైబర్‌ భద్రతా విభాగం ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించాయి.

ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులున్న అమెరికా సాంకేతిక దిగ్గజ సంస్థ ఫైర్‌ ఐ.. విదేశీ హ్యాకర్లు తమ నెట్‌వర్క్‌ పరిధిలోకి చొరబడి, సంస్థకు చెందిన కొన్ని హ్యాకింగ్ టూల్స్‌ చోరీ చేసినట్టు ప్రకటించిన కొద్ది రోజులకే తాజా ఘటన చోటుచేసుకుంది. కాగా, 2014లో కూడా రష్యాకు చెందిన హ్యాకర్లు అమెరికా ప్రభుత్వ ఈ-మెయిల్‌ వ్యవస్థలోకి అక్రమంగా చొరబడ్డారు. తాజా సైబర్‌ దాడికి దారితీసిన పరిస్థితులను గుర్తించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధికార ప్రతినిధి జాన్‌ ఉలియట్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

అమెరికా అతలాకుతలం

 అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని