USలో కరోనా విలయం: రోజులో 2.25లక్షల కేసులు!

అమెరికాలో కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఏకంగా 2.25లక్షల కేసులు నమోదు అయ్యాయని.. జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాలు వెల్లడించాయి

Published : 06 Dec 2020 02:34 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా వైరస్‌ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో ఏకంగా 2.25లక్షల కేసులు నమోదు అయ్యాయని.. జాన్‌ హప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయ గణాంకాల ద్వారా తెలిసింది. అంతేకాకుండా ఒకే రోజులో 2,506 మంది కొవిడ్‌ సంబంధిత కారణాలతో మృతి చెందారు. అమెరికాలో గత నెలలో కరోనా వైరస్‌ కేసులు మూడు సార్లు 2 లక్షల మార్కును అందుకున్నాయి. ఇప్పుడు ఏకంగా 24గంటల్లో 2.25లక్షల కేసులు నమోవ్వడం గమనార్హం.

గత రెండు వారాలుగా అమెరికాలో నిత్యం 2వేలకు పైగా కరోనా సంబంధిత మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు కారణాలను అన్వేషించగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్‌, టెక్సాస్‌ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాగా యూఎస్‌లో ఇప్పటి వరకు 1.40కోట్లకుపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 2.78లక్షల మంది కరోనా కారణంగా మరణించారు.

ఇదీ చదవండి

మనదేశంలోనూ ఫైజర్‌ టీకాకు అనుమతి

అమెరికాలో 24గంటల్లో 2 లక్షల కరోనా కేసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని