
నవంబర్ 1కల్లా అమెరికాలో వ్యాక్సిన్ సిద్ధం!
వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతానికి బ్రహ్మాస్త్రమైన వ్యాక్సిన్ అమెరికన్లకు నవంబర్ 1న అందుబాటులోకి రానుంది. ప్రజలకు వ్యాక్సినేషన్ చేయించేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాలకు అమెరికన్ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు, వైద్యశాఖలు, ఆస్పత్రులకు సీడీసీ ఈ వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనుంది. నవంబర్ 1నాటికి సమర్థవంతమైన కొవిడ్ టీకాను ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధంకావాలంటూ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చినట్టు అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అవసరమైన వసతులపై దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ రాసిన లేఖలో పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్‌జర్నల్ పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు ఆగస్టు 27వ తేదీతో అమెరికా రాష్ట్రాల గవర్నర్లకు సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ నుంచి లేఖలు వెళ్లాయి. త్వరలో మెక్కెసన్ కార్పొరేషన్ నుంచి దరఖాస్తులు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలతో పాటు స్థానిక వైద్య ఆరోగ్య విభాగాలకు ఈ సంస్థే టీకాలు సరఫరా చేయనుంది. ఈ మేరకు సీడీసీతో మెక్కెసన్ ఒప్పందం కుదుర్చుకుందని రెడ్‌ఫీల్డ్ తెలిపారు. టీకా పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రాలు సహకరించాలని, నవంబర్ 1 నాటికి ఆ కేంద్రాలన్నీ తమ కార్యకలాపాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందన్న విషయంలో స్పష్టతనిస్తూ మూడు దస్త్రాలతో కూడిన సమాచారం వైద్య ఆరోగ్య విభాగాలకు పంపారు. ఆ దస్త్రాల్లో ఉన్న సమాచారం ప్రకారం వ్యాక్సినేషన్ ఎలా చేయాలో, ఎలాంటి ప్రణాళిక సిద్ధంచేసుకోవాలో సూచించారు. మరో దస్త్రంలో ఉన్న సమాచారం ప్రకారం.. వ్యాక్సిన్ అక్టోబర్ చివరినాటికి అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ సమాచారం విషయంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల స్టంట్‌గా కూడా కొందరు అభివర్ణిస్తున్నారు.
మరోవైపు, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తుది ఆమోదానికి చేరువలో ఉందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే, వ్యాక్సిన్ అభివృద్ధి, దాని పంపిణీ విషయంలో పరస్పరం సహకరించుకొనేందుకు ఏర్పడిన ప్రపంచ దేశాల కూటమితో తాము కలిసి నడవబోమని కూడా అగ్రరాజ్యం చెప్పేసింది. దేశవ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగ కేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదుచేసుకున్నాయని ఆస్ట్రాజెనికా కూడా వెల్లడించింది. ఈ వాలంటీర్లంతా 18 ఏళ్ల పైబడినవారేనని, వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నట్టు పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- కూనపై అలవోకగా..
- IRE vs IND: ఐర్లాండ్‌పై అలవోకగా..