
ఉద్యోగం పోయింది.. అదృష్టం వరించింది
(ఫొటో: నవనీత్ ఫేస్‌బుక్ ఖాతా నుంచి)
దుబాయి: కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఓ లక్కీ డ్రాలో భారత్‌కు చెందిన 30ఏళ్ల నవనీత్ సంజీవన్ మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
కేరళలోని కాసర్‌గొడ్‌కు చెందిన నవనీత్ సంజీవన్ ఉపాధి నిమిత్తం అరబ్ దేశం వెళ్లారు. గత నాలుగేళ్లుగా అబుదాబీలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా.. కొవిడ్ మహమ్మారి కారణంగా అతడు పనిచేస్తున్న కంపెనీ గత నెల కొంతమంది ఉద్యోగులను తొలగించింది. అందులో నవనీత్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నోటిస్ పీరియడ్‌పై విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గత నవంబరు 22న నవనీత్.. దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా కోసం ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొన్నాడు. ఆదివారం ఈ డ్రా తీయగా.. నవనీత్‌ను అదృష్టం వరించింది. ఇందులో ఆయన ఒక మిలియన్ డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘అస్సలు నమ్మశక్యంగా లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని స్నేహితులు, తోటి ఉద్యోగులతో పంచుకోవాలనుకుంటున్నా’ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.