జమ్ముకశ్మీర్‌లో ఇక 5 అధికారిక భాషలు..!

జమ్ముకశ్మీర్‌లో ఐదు అధికారిక భాషలకు ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక అక్కడ ఉర్దూ, కశ్మీరీ, డోగ్రీ, హిందీ, ఆంగ్లం భాషలు అధికారిక భాషలుగా ఉండనున్నాయి.

Published : 03 Sep 2020 02:45 IST

సివిల్‌ సర్వీసుల్లో ‘మిషన్‌ కర్మయోగి’కి శ్రీకారం
కేంద్ర కేబినెట్‌ ఆమోదం

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఐదు అధికారిక భాషలకు ఆమోదం తెలుపుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక అక్కడ ఉర్దూ, కశ్మీరీ, డోగ్రీ, హిందీ, ఆంగ్లం భాషలు అధికారిక భాషలుగా ఉండనున్నాయి. స్థానిక ప్రజల కోరిక మేరకు ఈ ఐదు భాషలకు అధికారంగా గుర్తింపు ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ వెల్లడించారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఈరోజు జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. 

నేడు జరిగిన భేటీలో వీటితోపాటు మరిన్ని కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ‘మిషన్‌ కర్మయోగి’ జాతీయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సివిల్‌ సర్వీసులను మరింత శక్తిమంతంగా, పారదర్శకంగా తీర్చిదిద్దడమే ఈ మిషన్‌ లక్ష్యమని కేబినెట్‌ పేర్కొంది. వీటితోపాటు మరో మూడు అవగాహన ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. జపాన్‌ టెక్స్‌టైల్‌, ఫిన్లాండ్‌ మైనింగ్‌ మంత్రిత్వశాఖలతో పాటు డెన్మార్క్‌ పునరుత్పాదక ఇందన మంత్రిత్వశాఖతో అవగాహన ఒప్పందాలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని