వర్షం నీటిని అలా వాడొద్దు.. ఠాక్రేకు గడ్కరీ లేఖ

వర్షం నీరు వాడకంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. ముంబయిలో వరద నీటిని ఇరిగేషన్‌, నగరం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు నాసిక్‌, అహ్మద్‌నగర్‌లలో.......

Published : 15 Oct 2020 01:24 IST

ముంబయి: వర్షం నీరు వాడకంపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాశారు. ముంబయిలో వరద నీటిని ఇరిగేషన్‌, నగరం చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు నాసిక్‌, అహ్మద్‌నగర్‌లలో హార్టికల్చర్‌ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదనపు జలాలను కరవు పీడిత ప్రాంతాలకు తరలించి నీటి కొరతను అధిగమించవచ్చన్నారు. ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికతో పనిచేస్తే వరద నీరు, డ్రైనేజీ, మురుగు నీటిని ముంబయి నగరం పక్కనే ఉన్న ఠానేకు తరలించవచ్చన్నారు. ఆ నీటిని డ్యాంలో నిల్వచేయవచ్చని సూచించారు. అలా నిల్వ చేసిన నీటిని ఇరిగేషన్‌, పరిశ్రమలు, హార్టికల్చర్‌ కోసం వాడుకోవచ్చని సూచించారు. ఈ చర్యలు మిథి నదిలో కొన్నేళ్ల పాటు నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతుందని తెలిపారు. 

అలాగే, నగరంలోని అన్ని రహదారులను సిమెంట్‌ కాంక్రీట్‌ రహదారులుగా మార్చే ప్రాజెక్టును చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తారు రోడ్డులు భారీ వర్షాలకు నిలబడవన్నారు. వరదలు, డ్రైనేజీ సమస్యలను ఎదుర్కోవాలంటే సమగ్రమైన ప్రణాళిక అవసరమని తెలిపారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను ఓ అంతర్జాతీయ కన్సల్టెంట్‌కు సమర్పించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు పునరావృతమవుతున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుపై డీపీఆర్‌ సిద్ధం చేయాలన్నారు. ఈ లేఖ ప్రతిని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌కు పంపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు