రికార్డుస్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు

దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 50 లక్షల...........

Updated : 25 Dec 2020 20:46 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ ద్వారా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 50 లక్షల లావాదేవీలు జరిగాయి. తద్వారా వసూళ్లు తొలిసారి రూ.80 కోట్లు దాటినట్టు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు 2.20 కోట్ల ఫాస్టాగ్‌లను జారీ చేసినట్టు తెలిపింది. ఫాస్టాగ్‌ ద్వారా ఒక్కరోజులోనే (డిసెంబర్‌ 24న) తొలిసారిగా వసూళ్లు రూ.80 కోట్లు దాటడం, 50లక్షల లావాదేవీలు జరగడం ఓ మైలురాయిగా అభివర్ణించింది.

జనవరి 1 నుంచి నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్‌ తప్పనిసరని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. ఇందుకోసం టోల్‌ప్లాజాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపుల కోసం వాహనాలను ఆపకుండా ఈ ఫాస్టాగ్‌లు నివారిస్తాయని, ఫలితంగా ఇంధనం, ప్రయాణ సమయం ఆదా అవుతాయని తెలిపారు.

ఇదీ చదవండి..

TS: యూకే నుంచి వచ్చిన 16 మందికి కరోనా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని